మెదక్ జిల్లా లో దారుణ సంఘటన

వాస్తవం ప్రతినిధి: మెదక్ జిల్లాలోని చిన్న శంకరంపేట్ మండలం మందపూర్ గ్రామ సమీపంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు హత్య చేశారు. హత్య జరిగిన స్థలంకు సమీపంలో AP13G 7809 నెంబరు కారు నిలిపి ఉంది. అయితే అటుగా వెళ్ళిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీనితో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.