భరత్ బహిరంగ సభ కు హాజరు కానున్న స్టార్ హీరోలు

వాస్తవం సినిమా:   ఏప్రిల్ ఏడో తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ‘భరత్‌..’ కు సంబంధించిన ‘బహిరంగ సభ’ జరగనుంది. పొలిటికల్ థ్రిల్లర్ గా వస్తున్న సినిమా కావడంతో..విడుదలకు ముందు ఈవెంట్ ను ‘బహిరంగ సభ’గా వ్యవహరించడం టైమ్లీగా ఉంది. ఈ బహిరంగ సభకే.. అటు జూనియర్ ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ లు హాజరు కానున్నారట. అయితే ఇప్పటి వరకూ అధికారిక ధ్రువీకరణ ఏమీ లేదు కానీ.. చరణ్, తారక్ లు వస్తున్నారనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతోంది. ముఖ్య అతిథులుగా ఈ స్టార్ హీరోలు రాబోతున్నారని తెలుస్తోంది. రంగస్థలం ఉత్సాహంతో ఉన్న రామ్ చరణ్, మల్టీస్టారర్ చేసే ఉత్సాహంతో ఉన్న జూనియర్ లు ఇలా మహేశ్ బాబు సినిమా ఈవెంట్ లో మెరిస్తే.. ఈ ముగ్గురు హీరోల అభిమానులకూ ఒకేసారి పండగొచ్చినట్టని వేరే చెప్పనక్కర్లేదు!