పెళ్లి కాకపోవడానికి పక్కింటి ఆమ్మాయే కారణం అనుకోని హత్య చేసిన ప్రభుద్దుడు

వాస్తవం ప్రతినిధి: పెళ్లి కాకపొతే ఎందుకు కావడం లేదు, ఏంటి సమస్య అని అందరూ ఆలోచిస్తారు. కానీ ఒక ప్రభుద్దుడు మాత్రం తనకు పెళ్లి కావడంలేదని పక్కింటి అమ్మాయిని చంపేశాడు. ఆ అమ్మాయి తనకు పెళ్లి కాకుండా చేతబడి పూజలు చేయిస్తోందనే అనుమానంతోనే ఆమెను చంపేసినట్లు తెలుస్తుంది. చత్తీస్ ఘడ్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. రాయ్‌పూర్‌కి చెందిన పింటు అనే వ్యక్తి కొంతకాలంగా పెళ్లి చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే 12సార్లు పెళ్లిచూపులు కాగా.. ఆ అమ్మాయిలందరూ అతడితో పెళ్లి ఇష్టం లేదని చెప్పారు. తన పక్కింట్లో ఉంటున్న అమెరికా పటేల్‌ అనే యువతి తనకు పెళ్లి కానివ్వకుండా చేతబడి చేస్తోందని అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చున్నీతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పింటు పారిపోవాలని ప్రయత్నించగా చుట్టుపక్కల వారు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే అతడు ప్రస్తుతం బీఏ రెండో సంత్సరం చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.