ట్రక్కు ని గుద్దిన గూడ్స్  రైలు

వాస్తవం ప్రతినిధి: అమెరికాలోని జార్జియాలో ఒక ట్రక్కు డ్రైవర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రైలు పట్టాలను దాటుతూ వెళుతున్న ట్రక్కు ఉన్నట్టుండి రైల్వే గేటుకు డీ కొని పట్టాలపైనే నిలిచిపోయింది. దీనితో అటుగా వేగంగా గూడ్స్ రైలు వస్తుండడం తో వెంటనే అప్రమత్తమైన ట్రక్కు డ్రైవర్ ట్రక్కు ని పట్టాల పైనే నిలిపి వేసి అతడు తప్పించుకున్నాడు. దానితో వేగంగా వచ్చిన ఆ రైలు ట్రక్కు ని డీ కొని దాన్ని కొద్ది దూరం వరకు లాక్కెళ్ళింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన సంబందించిన వీడియో బయట పడడం తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.