కావేరి జలాల మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు కోసం దీక్ష కు దిగిన సీ ఎం,డిప్యూటీ సీ ఎం

వాస్తవం ప్రతినిధి: ఒకపక్క ఏపీ కి ప్రత్యెక హోదా కల్పించాలంటూ ఏపీ ఎంపీ లు అలానే వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో వరుస ఆందోళనలకు దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే మరోపక్క కావేరీ జలాల మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే నేతలు కూడా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ కావేరి జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేదిశగా అన్నాడీఎంకే అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం అకస్మాత్తుగా ముఖ్యమంత్రి ఎడపాడి పన్నీర్‌ సెల్వం, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌ సెల్వం నిరాహార దీక్ష దిగారు. వెంటనే కావేరీ జలాల మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఈ నిరాహార దీక్షకు దిగినట్లు తెలుస్తుంది.  ఈ నిరాహార దీక్షలో పార్టీ శ్రేణులు, నేతలు, మంత్రులు పాల్గొంటారని మొదట తెలిపారు. దీక్షలో కూర్చునే నేతల జాబితాలో సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీర్‌ పేరు లేదు. కానీ, కావేరీ జలాల విషయంలో అన్నాడీఎంకే కేంద్రంపై తగినంత ఒత్తిడి తీసుకురావడం లేదన్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఏకంగా పళని, పన్నీర్‌ ఇద్దరూ దీక్షలో కూర్చోవడం విశేషం. అయితే దీనిపై కేంద్రం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.