సోము వీర్రాజు పై సంచలన వ్యాఖ్యలు చేసిన బుద్దా వెంకన్న

వాస్తవం ప్రతినిధి: భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బుద్దా వెంకన్న మాట్లాడుతూ….. భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు వైకాపా అధినేత జగన్‌తో 2 గంటల పాటు రహస్య మంతనాలు జరిపారని ఆరోపించారు. ఆయన శకుని రాయబారం చేస్తున్నారని, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని వెంకన్న ఆరోపించారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ ప్రాంతాలను చిన్నచూపు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా వీర్రాజు అవినీతి కూడా సీఎం డాష్‌ బోర్డులో ఉందని, ఓ వైపు భాజపా, మరో వైపు వైకాపా కలిసి రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయని మండిపడ్డారు. 2019లో తమ అధినేత చంద్రబాబు ఎవరికి మద్దతు ఇస్తే.. వారే ప్రధాని అవుతారని బుద్దా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.