‘రంగస్థలం’లో చంద్ర బోస్ కలం నుండి మరో ఆణిముత్యం

వాస్తవం ప్రతినిధి: బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రంగస్థలం’ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు తిరిగరాస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్‌లోనూ ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ చిత్రం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ మధ్య కాలంలో తెలుగులో రాని ఒక విభిన్నమైన సినిమా కావడం, చెవుటి వాడిగా హీరో క్యారెక్టరైజేషన్, కథలోని భావోద్వేగాలు,1980ల నాటి పల్లెటూరి బ్యాక్ డ్రాప్ ఇలా అన్నీ కలగలపి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా దేవీ శ్రీ అందించిన సంగీతం మ్యూజిక్ లవర్స్‌ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ సంధర్భంగా శ్రీ చంద్ర బోస్ వ్రాసిన మరో. ‘ఓరయో’ అనే కొత్త పాటను రేపు సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటకు దేవీ శ్రీ సంగీతం సమకూర్చగా, చంద్ర బోస్ ఆలపించారు.