రంగమ్మత్తపాత్రలో నన్ను తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేమంటున్నారు: అనసూయ

వాస్తవం సినిమా: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. ఇప్పటికే ఈ సినిమా మంచి టాక్ తో విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సినిమాలో చరణ్ కు అత్తలా అనసూయ రంగమ్మత్త పాత్రను పోషించారు. ఈ పాత్రకు కూడా మంచి ఆదరణ లభించడంతో అనసూయపై ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్రలో రమ్యకృష్ణను తప్ప మరెవ్వరినీ ఎలా అయితే ఊహించుకోలేమో.. ‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్తపాత్రలో తనను తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేమని చాలా మంది అభిమానులు అంటున్నారని.. ఈ ప్రశంసలు తనకు చాలని చెప్పింది. రంగమ్మత్తలో ఉన్న ఒదుగుతనం తనలో ఉందని, అందుకే, ఆ పాత్రలో అంతగా తాను ఒదిగిపోయానని తెలిపింది. ఈ సినిమాలో ఇంత గొప్ప పాత్ర తనకు ఇచ్చిన దర్శకుడు సుకుమార్ కు ధన్యవాదాలు తెలియజేశారు.