ఘనంగా ముగిసిన లేపాక్షి ఉత్సవాలు

వాస్తవం ప్రతినిధి: కర్ణాటక, ఆంద్ర రెండు రాష్ట్రాల సంస్కృతీ సాంప్రదాయాల మేళవింపుతో ఘనంగా నిర్వహించుకొన్న నిండుపండగ లేపాక్షి ఉత్సవాలని ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. రెండు రోజులపాటు హిందూపురంలో నిర్వహించిన లేపాక్షి ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహంగా సాగింది. హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఉత్సవాల్లో శ్రీకృష్ణుడి వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉత్సవాల్లో భాగంగా పలువురు గాయకులు, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌తో కలిసి తాను నటించిన ‘పైసా వసూల్‌’ చిత్రంలోని పాట పాడి సభికులను ఉత్సాహపరిచారు. ‘మామా ఏక్‌ పెగ్‌ లా..’ అంటూ ఉత్సాహంగా స్టెప్పులేసి యువతను ఉర్రూత లూగించారు. వేడుకలకు ప్రజలు భారీగా తరలివచ్చారు.