గల్ఫ్ లో ఘోర ప్రమాదం .. ఏడుగురు భారతీయుల దుర్మరణం

వాస్తవం ప్రతినిధి: గల్ఫ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కువైట్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారతీయులు ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఆదివారం దక్షిణ కువైట్ ప్రాంతంలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో 15 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు భారతీయులు, ఐదుగురు ఈజిప్టు వాసులు – ముగ్గురు పాకిస్థానీయులు ఉన్నారు. గాయపడిన వారిలో ఇద్దరు భారతీయులు ఉండగా – వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

మృతులంతా కువైట్ ఆయిల్ కంపెనీకి సబ్ కాంట్రాక్టర్ గా ఉన్న బర్గన్ డ్రిల్లింగ్ లో పనిచేస్తున్నారు. మరణంచిన వారిలో ఇద్దరు తెలంగాణ వారు ఉన్నారని తెలుస్తోంది. ఇందులో కరీంనగర్ జిల్లాకు చెందిన వారు ఇద్దరని సమాచారం. తెలంగాణ నుంచి వలస వెళ్లి మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.