ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకుంటున్న చెయ్-సామ్ జంట

వాస్తవం సినిమా: అమెరికాలో ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే పార్కులో.. ఇదే స్పాట్ లో ఏం మాయ చేశావే మూవీ షూటింగ్ జరిగింది. అది సమంతకు తొలి చిత్రం అయితే.. చైతుకు ఫస్ట్ గ్రాండ్ సక్సెస్ అందించిన మూవీ. అక్కడ ప్రారంభమైన పరిచయం.. ఆ తర్వాత మెల్లమెల్లగా ప్రేమ.. ఇప్పుడు పెళ్లి వరకూ దారి తీసింది. ప్రస్తుతం ఆ క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు చెయ్-సామ్ జంట.. మనకు కూడా వాటిలో కొన్నిటిని పంచుతున్నారు. ప్రస్తుతం అభిమానుల కోసంగా చై తో కలిసి సెంట్రల్ పార్క్ నుంచి ఓ ఫోటో సమంత పోస్ట్ చేసింది.తాజాగా సమంత నటించిన రామ్ చరణ్ మూవీ రంగస్థలం రిలీజ్ కాగా.. ఈ చిత్రంలో ఆమె నటించిన రామలక్ష్మి పాత్రకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. బోలెడన్ని ప్రశంసలను స్వీకరిస్తూ.. సోషల్ మీడియా ద్వారా ఫాన్స్ కు థ్యాంక్స్ చెప్పింది.