అముల్ మేనేజింగ్ డైరక్టర్ కే.రత్నం రాజీనామా

వాస్తవం ప్రతినిధి: అముల్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ కే.రత్నం రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. శనివారం జరిగిన బోర్డు సమావేశంలో ఎండీ రాజీనామాకు చైర్మన్ రామ్‌సిన్ పర్మార్ ఆమోదం తెలిపారు. గుజరాత్‌లోని ఆనంద్ నగరంలో ఉన్న అముల్ పాల ఉత్పత్తుల సంస్థకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల డెయిరీలో జరిగిన అవకతవకలకు ఆయనే కారణమని ఆరోపణలు వెల్లువెత్తడం తో ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. టెండర్ల కేటాయింపు, రిక్రూట్‌మెంట్‌లో సుమారు 450 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఇదంతా కూడా ఎండీ రత్నం  కారణం గానే అంటూ ఆ ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. కేవలం ఫ్యామిలీ కారణాల వల్ల రాజీనామా చేసినట్లు చెప్పాడు. రాజీనామా చేసిన రత్నం స్థానంలో జనరల్ మేనేజర్ జేయన్ మెహతాను నూతన ఎండీ నియమిస్తున్నట్లు అముల్ డెయిర్ ఓ ప్రకటనలో తెలిపింది.