హిజాబ్ ధరించడం తో వత్తిడి తీసుకురావద్దు

వాస్తవం ప్రతినిధి: పిన్న వయస్కులైన బాలికలు హిజాబ్‌ (బురఖా) ధరించడంపై నిషేధం విధించాలంటూ స్కూళ్ళపై బ్రిటన్ ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తుంది. ఈ నేపధ్యంలో సూళ్ల పై వత్తిడి తీసుకురావడాన్ని బ్రిటన్‌లో అతిపెద్ద టీచర్స్‌ యూనియన్‌ ఎన్‌ఇయు తీవ్రంగా వ్యతిరేకించింది. ఇక్కడ జరిగిన ఒక సమావేశంలో నేషనల్‌ ఎడ్యుకేషన్‌ యూనియన్‌ (ఎన్‌ఇయు) ఈ అంశంపై చర్చించింది. ఈ విష యంలో పాఠశాలల పర్యవేక్షక సంస్థ జోక్యం చేసుకోవడాన్ని విమర్శిం చింది. విద్యా రంగంలో ప్రామాణికాల కార్యాలయం (ఆఫీస్‌ ఫర్‌ స్టాండర్డ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌-ఆఫ్‌స్టెడ్‌) చీఫ్‌ అమండా స్పైల్‌మన్‌ మాట్లాడుతూ, కేవలం ఐదేళ్ళ వయస్సున్న ముస్లిం బాలికలు కూడా తలపై బురఖా ధరించడం పట్ల తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. వారు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసుకోవాల్సిందిగా స్కూళ్ళ ఇన్‌స్పెక్టర్లను కోరారు.