సిరియా ఆర్ధిక సాయాన్ని నిలిపివేసిన ట్రంప్

వాస్తవం ప్రతినిధి: అంతర్యుద్ధంతో విచ్ఛిన్నమైన సిరియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పెద్ద షాక్ ఇచ్చారు. ఇటీవల సిరియా నుంచి తమ బలగాలను వెనక్కి పిలిపించానున్నట్లు ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు భారీ ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు శనివారం  ట్రెజరీ(నిధుల) విభాగానికి ఆయన ఆదేశాలు జారీచేశారు.  తాజాగా సిరియా నుంచి తమ బలగాలు వెనక్కి తీసుకోవాలని అమెరికా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు తాజాగా ప్రకటించడం తో సిరియా కు పెద్ద షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం తో సుమారు 200 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని సిరియా కోల్పోయింది.