మెహదీపట్నంలో అగ్ని ప్రమాదం..ఒకరు సజీవ దహనం

వాస్తవం ప్రతినిధి: హైదరాబాద్ నగరంలోని మెహదీపట్నంలో ఉన్న గుడిమల్కాపూర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలోని విజయశ్రీ అపార్ట్‌మెంట్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో మంటల్లో చిక్కుకొని ఒక రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఒకరు సజీవ దహనమైనట్లు సమాచారం. అయితే వెంటనే ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.