నెట్టింట్లో వైరల్ గా మారిన నాని ఎమోషనల్‌ ట్వీట్ !

వాస్తవం సినిమా: వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న న‌టుడు, నిర్మాత నాని సోషల్‌ మీడియాలో సంద‌డి చేస్తుంటాడు. త‌న సినిమా, వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను ప్రేక్ష‌కులు, అభిమానుల‌తో పంచుకుంటూ ఉంటాడు. మొన్న దొంగ నా కొడుకు అంటూ త‌న ముద్దుల కుమారుడిని ముద్దుగా తిడుతూ బ‌ర్త్ డే విషెస్ చెప్పాడు. ఇప్పుడు మ‌రోసారి త‌న జీవితంలోని ప్ర‌ముఖ వ్య‌క్తి గురించి పంచుకున్నాడు.

నాని తల్లి విజయలక్ష్మి ఫార్మ‌సిస్ట్‌. ఆమె శనివారం (మార్చి 31) ఉద్యోగ పదవీ విరమణ పొందారు. దీంతో అది గుర్తు చేసుకుంటూ ఓ ఎమోషనల్‌ ట్వీట్ చేశారు. ‘30 ఏళ్లుగా ఫార్మసిస్ట్‌. ఎప్పుడూ నవ్వుతూ.. సాయం చేయడానికి ముందుంటారు. అని చెబుతూ త‌న త‌ల్లితో దిగి ఉన్న ఫొటోను పంచుకున్నారు. వైద్యులు, రోగులు ఆమెను ఇష్టపడతారు. మేము మరింతగా ప్రేమిస్తాం. ఈ రోజు ఆమె చివరి ప‌ని దినం (వర్కింగ్ డే). నిన్ను చూస్తే గర్వంగా ఉందమ్మ’ అంటూ నాని ట్వీట్ చేశారు.

ప్రస్తుతం నాని సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ద్విపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్ధం సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమాలో అక్కినేని నాగార్జునతో కలిసి మ‌రో సినిమా చేస్తున్నాడు.