ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో చంద్రబాబు దిల్లీ పర్యటన

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో దిల్లీ వెళ్లనున్నారు. విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా సాధనకోసం పార్లమెంట్‌లో తెదేపా ఎంపీలు చేస్తున్న ఆందోళనకు వివిధ జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఏప్రిల్‌ 2, 3 తేదీల్లో దిల్లీ వెళ్లాలని తొలుత చంద్రబాబు భావించారు. తాజాగా ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో దిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. విభజన సమస్యల విషయంలో కేంద్రంపై పోరాడేందుకు జాతీయపార్టీల మద్దతు కూడగట్టే దిశగా చంద్రబాబు పర్యటన సాగనుంది.  విభజన హామీలను పక్కనబెట్టి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాన్ని చంద్రబాబు పలు పార్టీలకు వివరించనున్నారు.