‘ఇదం జగత్‌’టైటిల్‌ లోగో విడుదల

వాస్తవం సినిమా: అనిల్‌ శ్రీకంఠంని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న థ్రిల్లర్‌ సినిమాలో నటిస్తున్నాడు అక్కినేని వారసుడు సుమంత్‌ . ఈ సినిమాలో ప్రేమమ్‌ ఫేం అంజు కురియెన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు ‘ఇదం జగత్‌’ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ లోగోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. ఈ సినిమాలో సుమంత్‌ ఫొటో జర్నలిస్ట్‌ పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో తొలిసారిగా సుమంత్‌ నెగెటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నారన్న ప‍్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో పాటు సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాలోనూ నటిస్తున్నాడు.