5 ఏళ్ల తరువాత సొంత ఊరిలో అడుగుపెట్టిన మలాలా

వాస్తవం ప్రతినిధి:  నోబెల్ గ్రహీత మలాలా ప్రస్తుతం పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆమె ఈ రోజు స్పాట్ వ్యాలీ లో ఉన్న తన స్వంత వూరు మింగోరా కు వెళ్ళినట్లు తెలుస్తుంది. విద్య, మహిళల హక్కుల కోసం పోరాడినందుకు 2012లో ఆమెను తాలిబన్లు కాల్చిన అనంతరం ఐదేళ్ల తరువాత మొదటి సారిగా ఆమె తన స్వగ్రామంలో అడుగుపెట్టారు. కట్టుదిట్టమైన భద్రతల నడుమ ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఆర్మీ విమానంలో స్వాట్‌ వ్యాలీలో అడుగుపెట్టారు. స్వంత ఊళ్లోని స్వంత ఇంటికి చేరుకోగానే మలాలా ఒక్కసారి భావోద్వేగానికి లోనై కన్నీళ్ల పర్యంతం అయ్యారు. మలాలా తండ్రి ఆమెను ఓదార్చాడు. ఇస్లామాబాద్ నుంచి మింగోరా వరకు ప్రత్యేక హెలికాప్టర్‌లో మలాలా వెళ్లింది. పాక్ ఆర్మీ ఆ హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసింది. మళ్లీ సోమవారం ఆమె బ్రిటన్‌కు తిరుగు ప్రయాణమవుతున్నట్లు తెలుస్తుంది.