సాంకేతిక తప్పిదం వల్లే సుశీల్ పేరు కనిపించలేదట!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల కామన్వెల్త్‌ క్రీడ దిగ్గజ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ పేరు కామన్వెల్త్  క్రీడల అధికారిక వెబ్ సైట్ లో కనిపించక పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ సారి ఈ క్రీడల్లో సుశీల్ పోటీపడుతున్నాడా లేదా..? అంటూ రెజ్లింగ్‌ వర్గాల్లో శుక్రవారం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆందోళన చెందిన సుశీల్‌ కూడా భారత రెజ్లింగ్‌ సమాఖ్యతో సంప్రదింపులు జరిపాడు. సమాఖ్యతో గొడవ కారణంగా గతంలో అతడు ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ విధంగా సుశీల్ పేరు అధికారిక వెబ్ సైట్ లో కనిపించలేదు అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఐతే.. సాంకేతిక తప్పిదం వల్ల సుశీల్‌ పేరు కనిపించలేదని, వెంటనే అతని పేరును జతచేశామని వెబ్‌సైట్‌ నిర్వాహకులు తెలిపారు. బుధవారం ఆస్ట్రేలియాలో ఆరంభం అవుతున్న కామన్వెల్త్‌ క్రీడల రెజ్లింగ్‌లో సుశీల్‌ 74 కిలోల విభాగంలో పోటీపడుతున్నాడు.