షూటింగు దశలో ‘సైరా’..కీలక సన్నివేశాల చిత్రీకరణ

వాస్తవం సినిమా: ‘ సైరా’ షూటింగ్ శరవేగంగా జరిగిపోతోంది. తాజాగా చిరంజీవి .. నయనతార .. అమితాబ్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన స్టిల్స్ చూసిన వాళ్లు .. ‘బాహుబలి’ సినిమాను గుర్తుచేసుకున్నారు.
‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో చిరంజీవి ఎలా ఉంటారు. ఈ చిత్రంలో చిరంజీవికి, అమితాబ్‌ బచ్చన్‌కు సంబంధం ఏమిటి? బిగ్‌ బీ పాత్ర ఎలా ఉండుబోతుంది అన్నది వారం రోజులుగా మెగా అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్నలు.
తాను ఏం చేసినా వెంటనే ట్విట్టర్‌లో పోస్టు చేసేయడం అలవాటున్న అమితాబ్‌ తన పార్టు షూటింగ్‌ పూర్తయిన వెంటనే సెట్‌లో ఫొటోలను పోస్టు చేశాడు. చిరంజీవితో కలసి నటించడం గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
అయితే ఇందులో చిరంజీవి, నయనతార యాగం చేస్తున్నప్పుడు, పక్కన గురువుగా అమితాబ్‌ కూర్చొని ఉన్న ఫొటోలు అవి. దీనిని బట్టి అమితాబ్‌ చిరంజీవికి గురువుగా అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రాయలసీమకు చెందిన స్వతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. టైటిల్‌ రోల్‌ను చిరంజీవి పోషిస్తున్నాడు. కథానాయికగా నయనతార చేస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. జగపతిబాబు, విజరు సేతుపతి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.