ప్రధాని,షాల పై అవమానకర వ్యాఖ్యలు చేసిన రాహుల్….కేసు నమోదు!

వాస్తవం ప్రతినిధి: ప్రధాని మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షాపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై కేసు నమోదైనట్లు తెలుస్తుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని దేవరియా, హమీర్‌పుర్‌లోని న్యాయస్థానాల్లో రాహుల్ పై కేసులు నమోదయ్యాయి. ఇటీవల నిర్వహించిన కాంగ్రెస్‌ సభల్లో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని ఉత్తర్‌ప్రదేశ్‌ భాజపా ప్రతినిధి శలభ్‌మణి త్రిపాఠి చెప్పారు. ఈ నేపధ్యంలో దేవరియా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో కేసు దాఖలైనట్లు తెలుస్తుంది. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్‌ 5న  విచారణ ఉంటుందన్నారు. హమీర్‌పుర్‌ సీజేఎం న్యాయస్థానంలో పరువునష్టం వ్యాజ్యం దాఖలు చేసినట్లు అడ్వొకేట్‌ అవధ్‌ నరేశ్‌సింగ్‌ చందేల్‌ చెప్పారు.