నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ అధికారులు

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం రైల్వేస్టేషన్‌లో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపధ్యంలో ఇద్దరు బెంగళూరు వాసుల నుంచి రూ. 10.20 లక్షల నకిలీ నోట్లను అధికారులు స్వాదీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో హావ్‌డా నుంచి హైదరాబాద్‌కు నకిలీ నోట్లను తరలిస్తుండగా ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. త్వరలో కర్ణాటక లో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఈ నకిలీ నోట్లు పంపిణీ చేసేందుకు వెళ్తున్నట్లు నిందితులు స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపధ్యంలో  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.