జమ్మూ లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు

వాస్తవం ప్రతినిధి: జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులు జరపడం తో ట్రాఫిక్ పోలీసుకు గాయాలు అయినట్లు తెలుస్తుంది. ఖానబాల్ ఏరియాలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి పరారీ అయ్యారు. దీనితో తీవ్ర గాయాలపాలైన పోలీసును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.