జగన్ ప్రజాసంకల్పయాత్ర @ 125వ రోజు

వాస్తవం ప్రతినిధి: ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకై ప్రతిపక్షనేత, వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో అప్రతిహతంగా కొనసాగుతోంది. 125వ రోజు ప్రజాసంకల్పయాత్రను శనివారం ఉదయం సరిపూడి శివారు నుంచి వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతరం వెలవర్తిపాడు, మేడి కొండూరు మీదుగా గుండ్లపాలెం క్రాస్‌ చేరుకుంటారు. అనంతరం వైఎస్ జగన్ లంచ్‌ విరామం తీసుకుంటారు.

భోజనం విరామం అనంతరం మధ్యాహ‍్నం 2:45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. గుండ్లపాలెం క్రాస్‌ నుంచి వైఎస్ జగన్ పేరిచెర్ల చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. శుక్రవారం నాటికి 1,647.5 కిలోమీటర్ల పాదయాత్రను వైఎస్ జగన్ పూర్తి చేసుకున్నారు.