చైనా,జపాన్ లో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొననున్న ఉత్తర కొరియా

వాస్తవం ప్రతినిధి: రానున్న రెండు సంవత్సరాల్లో జపాన్‌, చైనాలో జరిగే ఒలింపిక్స్‌ క్రీడల్లో ఉత్తర కొరియా పాల్గొననుందని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ శనివారం తెలిపారు. ప్యోంగ్యాంగ్‌లో ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ జంగ్‌ ఉన్‌తో సమావేశానంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దక్షిణ కొరియాలో ప్యోంగ్‌చాంగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌లో ఉత్తరకొరియా పాల్గనడంతో రెండు దేశాల్లో ఉద్త్రికతలు తగ్గిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియాను ఆహ్వానించేందుకు గురువారం ఆయన ప్యోంగ్యాంగ్‌ చేరుకున్నారు. చర్చల అనంతరం బీజింగ్‌ విమానాశ్రయానికి చేరుకున్న థామస్‌ మీడియాతో మాట్లాడుతూ 2020వ సంవత్సరం టోక్యోలో జరిగే సమ్మర్‌ గేమ్స్‌, 2022వ సంవత్సరంలో బీజింగ్‌లో జరిగే వింటర్‌ గేమ్స్‌లోనూ ఉత్తరకొరియా పాల్గంటుందని తెలిపారు.