ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన రష్యా!

వాస్తవం ప్రతినిధి: రష్యా అధునాతన ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించినట్లు తెలుస్తుంది. అయితే ఈ క్షిపణి విజయవంతం అయిందని రష్యా సైన్యం తెలిపింది. సార్మాత్‌ అనే ఈ అస్త్రాన్ని ప్లెసెటెస్క్‌ నుంచి ప్రయోగించినట్లు రష్యా సైన్యం వివరించింది. ప్రపంచంలోనే అత్యంత భారీ ఐసీబీఎంగా పేరు పొందిన వొయేవోడా’ (సాతాన్‌) అనే క్షిపణి స్థానంలో ఈ ఖండాతర క్షిపణి ని ప్రవేశపెట్టనున్నారు. సార్మాత్‌ బరువు 200 టన్నులు, అలానే సాతాన్‌ కన్నా ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ఉత్తర, దక్షిణ ధ్రువాల గుండా పయనిస్తూ ప్రపంచంలో ఏ లక్ష్యం మీదైనా  విరుచుకుపడగలదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే.  ఇది పెద్ద సంఖ్యలో అణు వార్‌హెడ్లను కూడా మోసుకెళ్లగలదని, ఇవి శత్రుదేశాల క్షిపణి రక్షణ వ్యవస్థలను ఏమార్చగలవని వివరించారు.