కోచ్ గా ఇర్ఫాన్ పఠాన్!

వాస్తవం ప్రతినిధి: టీమిండియా సీనియర్‌ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ ఇక నుంచి కోచ్ గా కనిపించనున్నాడు.  జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్ర జట్టుకు కోచ్‌, మెంటార్‌గా ఇర్ఫాన్ పఠాన్ నియామకమయ్యాడు. అయితే ఏడాది పాటు ఇర్ఫాన్ ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ నేపధ్యంలో కాశ్మీర్‌లోని క్రికెట్‌ స్టేడియంలో స్థానిక ఆటగాళ్ళతో కాసేపు ముచ్చటించిన ఆయన క్రికెట్‌లో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే కఠిన సాధన, నిబద్ధత అవసరమని స్థానిక ఆటగాళ్లకు సూచించారు.