‘కమ్మార సంభవం’ లో దిలీప్ త్రిపాత్రాభినయం

వాస్తవం సినిమా: మలయాళంలో మంచి ఇమేజ్ వున్న కథానాయకులలో దిలీప్ ఒకరు. ఆయన తాజా చిత్రంగా ‘కమ్మార సంభవం’ రూపొందింది. యంగ్ హీరో సిద్ధార్థ్ తొలిసారిగా మలయాళంలో నటించిన సినిమా ఇదే. తాజాగా ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తోందట. విజువల్స్ పరంగా .. నేపథ్య సంగీతం పరంగా ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. బ్రిటీష్ కాలంనాటి నేపథ్యంతో కూడిన ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవడం ఖాయమనిపిస్తోంది. నాటి గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్యుల పరిస్థితులను కూడా కళ్లకు కట్టారు. ఈ సినిమాలో దిలీప్ 3 ప్రత్యేకమైన గెటప్స్ లో కనిపించనుండటం విశేషమని అంటున్నారు. నమితా ప్రమోద్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, వేసవిలో విడుదల చేయనున్నారు.