ఓటర్లను ఆకర్షించడానికే లింగాయత్ ల ఎత్తుగడ: షా

వాస్తవం ప్రతినిధి: కర్ణాటక లో ఎన్నికలు దగ్గరవుతుండడం తో అక్కడ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఏ పార్టీతోనూ జత కట్టేది లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. అంతేకాకుండా అన్ని స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన అన్నారు.  మైసూరులో రెండవ సారి టూర్ చేస్తున్న అమిత్ షా కర్ణాటక లో తమ పార్టీ పూర్తి ఆధిక్యం సాధిస్తున్నందని, లింగాయత్ లకు ప్రత్యేక మతం హోదా ఇవ్వాలన్న అంశంపై ఎన్నికల తర్వాత స్పష్టమైన వివరణ ఇస్తామని షా తెలిపారు. ఓటర్లను ఆకర్షించేందుకే సీఎం సిద్ధారామయ్య ఈ లింగాయత్ ల అంశం లేవనెత్తారని ఆయన విమర్శించారు.