ఏప్రిల్ 7వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో..

వాస్తవం సినిమా: భరత్ అనే నేను’ ఆడియో వేడుకపై మహేశ్ బాబు అభిమానులు దృష్టి పెట్టారు. ఏప్రిల్ 7వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకను జరపనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ఎన్టీఆర్ ను .. చరణ్ ను మహేశ్ ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. ఇక ఎన్టీఆర్ .. చరణ్ లతో కొరటాలకి కూడా ఎంతో సాన్నిహిత్యం వుంది. ఆల్రెడీ ఆయన ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ చేయగా .. త్వరలో చరణ్ తో ఓ మూవీ చేసే ఛాన్స్ వుంది.ఇక ఎన్టీఆర్ .. చరణ్ కలిసి ఓ మల్టీ స్టారర్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరూ ‘భరత్ అనే నేను’ ఆడియో వేడుకకి హాజరైతే, ఘట్టమనేని అభిమానులతో పాటు .. నందమూరి అభిమానులు .. మెగా ఫ్యాన్స్ కూడా ఈ స్టేజ్ ముందు చేరిపోవడం ఖాయమని చెప్పొచ్చు.