ఏప్రిల్ 2న భారత్ బంద్ చేపడుతున్న దళిత సంఘాలు

వాస్తవం ప్రతినిధి:  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నేపథ్యంలో పబ్లిక్ సర్వెంట్లను వెంటనే అరెస్ట్ చేయడాన్న సుప్రీంకోర్టు నిషేధించింది. అపాయింటింగ్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతే అరెస్ట్ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం తాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం నిర్ణయంపై దళిత సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీం నిర్ణయం ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రతిబందంకంగా మారుతుందని చెబుతున్నారు.అట్రాసిటీ కేసులపై పూర్తి విచారణ చేసిన అనంతరం కేసులు నమోదు చేస్తే దోషులు సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని దళిత సంఘాల నేతలు అంటున్నారు.ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను యథాతథంగా ఉంచాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళనకు దళిత సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన భారత్ బందుకు పిలుపునిచ్చాయి.