ఇజ్రాయెల్-గాజా సరిహద్దుల్లో హింసాత్మకంగా మారిన నిరసన  

వాస్తవం ప్రతినిధి: ఇజ్రాయెల్‌-గాజా సరిహద్దులో పాలస్తీనియన్లు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. పాలస్తీనియన్లు- ఇజ్రాయెల్‌ దళాల మధ్య చెలరేగిన గొడవల్లో 16 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 11 వందల మంది గాయాలపాలైనట్లు తెలుస్తుంది. శరణార్థులు తిరిగి ఇజ్రాయెల్‌కు వచ్చే అంశంపై ఆరు వారాల పాటు ఇజ్రాయెల్‌-గాజా సరిహద్దులో నిరసన చేపట్టాలని పాలస్తీనియన్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం నుంచి ప్రారంభమైన నిరసన కార్యక్రమం హింసాత్మకమవ్వడం తో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌ నుంచి జెరూసలేంకు అమెరికా ఎంబసీని మార్చనున్నట్లు ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్ ఫొటోలను నిరసనకారులు తగులబెట్టారు. దీంతో 30 వేల మందిపై ఇజ్రాయెల్‌ సైన్యం డ్రోన్లను ఉపయోగించి ఏడుపు వాయువును ప్రయోగించినట్లు తెలుస్తుంది.