అమెరికా, ఈయూ దేశాలపై ప్రతీకార చర్యలకు పాల్పడిన రష్యా

వాస్తవం ప్రతినిధి: అగ్రరాజ్యం అమెరికా,ఈయూ దేశాల పై రష్యా ప్రతీకార చర్యలకు పాల్పడింది.  తమ దౌత్యవేత్తలను బహిష్కరించిన అమెరికా, బ్రిటన్‌తోపాటు యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలపై ప్రతీకారంగా 60 మంది అమెరికా దౌత్య వేత్తలను బహిష్కరించింది. మాజీ గూఢచారిపై రష్యా విషప్రయోగం జరిపిందన్న ఆరోపణతో బ్రిట న్.. రష్యాకు చెందిన దౌత్యవేత్తలను బహిష్కరించింది. దాని కొనసాగింపుగా అమెరికా, ఈయూ సభ్య దేశాలూ 150 మంది రష్యా రాయబారులను బహిష్కరించడం తో దీనికి ప్రతీకారంగా రష్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా సెయింట్ పీటర్స్ బర్గ్‌లోని అమెరికా రాయబార కా ర్యాలయాన్ని 48 గంటల్లో మూసేయాలని ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇంతక ముందు బ్రిటన్,ఫ్రాన్స్,జర్మనీ,కెనడా తదితర దేశాల రాయబారులను బహిష్కరించిన రష్యా తాజాగా డచ్ దౌత్యవేత్తలను కూడా బహిష్కరిస్తున్నట్లు తెలిపింది.