10 సెకన్ల లో 15 అంతస్తుల భవంతిని నేలకూల్చారు!

వాస్తవం ప్రతినిధి: నూతన భవన నిర్మాణ రంగంలో చైనా ఆధునిక పోకడలు చూపుతూ ప్రపంచ దేశాలను సంభ్రమాశ్చర్యాల కు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా నిర్మాణ రంగంలో ఆధునిక పోకడలు పోయే చైనా.. పాత భవంతులను కూల్చడంలోనూ సిద్ధహస్తురాలన్న విషయాన్నీ మరోసారి నిరూపించుకుంది. నైరుతి చైనాలోని సిచువాన్‌ ఫ్రావిన్స్‌ చెంగ్డూ నగరంలో ఇటీవల ఓ భారీ భవంతిని నేలమట్టం చేసినప్పటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్‌ అయింది. 20 ఏళ్లనాటి భవంతిని కూల్చేసి, అక్కడ మల్టీపర్సపస్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలనుకున్న అధికారులు.. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నేపధ్యంలో ముందు జాగ్రత్తగా భవంతి చుట్టూ పక్కల ఇళ్ళ ను ఖాళీ చేయించిన అధికారులు అనంతరం శక్తివంతమైన డిటోనేటర్ల ను అమర్చి,కేవలం 10 సెకన్ల లోనే 15 అంతస్తుల భవంతిని నేలమట్టం చేసారు. అయితే బిల్డింగ్‌ కూలిన వెంటనే దట్టమైన పొగ అలముకోవడం తో ఆ పొగ చుట్టుపక్కలకు వ్యాపించకుండా భారీ సంఖ్యలో డస్ట్‌ క్వికర్లను అమర్చడంతోపాటు.. పెద్ద పెద్ద పైపులతో నీళ్లను చల్లారు. పకడ్బందీగా సాగిన కూల్చివేత ఆపరేషన్‌ అనుకున్నట్లే సజావుగా జరగడంతో అధికారులు అంతా ఊపిరిపీల్చుకున్నారు.