“సూప‌ర్‌స్టార్ చిరంజీవితో అదే ఫ్రేమ్‌లో గౌర‌వం ఉండాలి” : బిగ్‌బి

వాస్తవం సినిమా:బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి కలిసి “సైరా నరసింహారెడ్డి” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అమితాబ్.. చిరుకు గురువు పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల చిత్రబృందం అమితాబ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. దీనిని ఉద్దేశించి బిగ్‌బి.. ఇద్దరికి సమాన గౌరవం దక్కింది అనే ఉద్దేశ౦తో “సూప‌ర్‌స్టార్ చిరంజీవితో అదే ఫ్రేమ్‌లో గౌర‌వం ఉండాలి” అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ తెలుగులో ఉండ‌డం విశేషం. ఈ ట్వీట్‌కు స్పందించిన మెగా కోడలు ఉపాసన.. “నిర్మాతగా మిస్టర్‌ సి(చరణ్‌)కి ఇది గర్వించదగ్గ విషయం” అంటూ రిప్లై ఇచ్చింది. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కనున్న “సైరా నరసింహారెడ్డి” చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. జగపతిబాబు, విజయ్‌ సేతుపతి ప్రతినాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్నారు.