శిఖరాగ్ర సమావేశానికి తేదీ ఖరారు

వాస్తవం ప్రతినిధి: ఉభయకొరియాల శిఖరాగ్ర సమావేశానికి తేదీ ఖరారైనట్లు తెలుస్తుంది. శీతాకాల ఒలింపిక్స్ అనంతరం ఉభయ కొరియా ల మధ్య శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది అని ఇరు దేశాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పాన్ మున్ జోన్ లో ఏప్రిల్ 27 వ తేదీన ఉభయ కొరియా లు శిఖరాగ్ర సమావేశం జరిపేందుకు తమ నేతలు అంగీకరించినట్లు ఉమ్మడి అధికారులు ప్రకటించారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చైనా రహస్య పర్యటనకు వెళ్లి వచ్చిన వెంటనే పాన్‌మున్‌జోన్‌లో జరిగిన ఇరు దేశాల ఉన్నతాధికారుల భేటీలో ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ఈ సమావేశంతో కొరియా యుద్ధం తర్వాత ఉత్తరకొరియా నేత ఒకరు దక్షిణ కొరియాలో అడుగుపెట్టనుండటం ఇదే ప్రథమం కానుంది. దీని తర్వాత మేలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చారిత్రక సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే.