శబరిమల లో ఏనుగు భీభత్సం….ఒకరి పరిస్థితి విషమం!

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమలలో ఏనుగు భీభత్సం సృష్టించింది. శుక్రవారం అయ్యప్పస్వామి జన్మదినం కావడంతో శబరిమల ఆలయంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వేడుకలో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అయితే స్వామీ ఊరేగింపు కొనసాగుతున్న సమయంలో ఓ ఏనుగు అదుపుతప్పి పరుగులు తీయడం తో అక్కడున్నవారంతా భయకంపితులై పరుగులు తీశారు. ఈ సందర్భంగా అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. దీనితో ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడగా, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.