యుద్దాల కోసం ఏడు లక్షల కోట్ల డాలర్లు వృధా చేశాం అన్న ట్రంప్!

వాస్తవం ప్రతినిధి: పశ్చిమాసియా లో జరిగిన యుద్దాల కోసం అమెరికా ఏడూ లక్షల కోట్ల డాలర్లు వృధా చేసిందంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ నేపధ్యంలో సిరియా నుంచి తమ దళాలను త్వరలో ఉపసంహరించనున్నట్లు ఆయన తెలిపారు. అలానే సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అంతం చేసేందుకు అమెరికా అన్ని ప్రయత్నాలు చేసిందన్నారు. ఇస్లామిక్ స్టేట్‌ను రూపుమాపుతున్నామని, త్వరలోనే సిరియా నుంచి బయటకు రానున్నట్లు ట్రంప్ తెలిపారు. యుద్ధాల కోసం లక్షల కోట్లు ఖర్చు చేసి.. దేశంలో మౌళిక సదుపాయాలను కల్పించుకోలేకపోయామని ట్రంప్ అన్నారు. ఒహియాలో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.