మూడేళ్ళుగా ఆమెతో రిలేషన్ షిప్ లో ఉంటున్న మాల్యా

వాస్తవం ప్రతినిధి: బ్యాంకులకు 9 వేల కోట్లు ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయిన లిక్క‌ర్‌ కింగ్ విజయ్ మాల్యా.. ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె పేరు పింకీ లాల్వానీ. గతంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసిన పింకీ తో మూడేళ్లు గా రిలేషన్ షిప్ లో ఉంటుంది. ఇటీవల వాళ్ల మధ్య లివింగ్ రిలేషన్ షిప్ లో అడుగుపెట్టి మూడేళ్ళు అయిన సందర్భంగా లండన్ లో సెలెబ్రేషన్ కూడా చేసుకున్నారు. మాల్యా కంటే వయసులో చాలా చిన్నది. మాల్యా ఉండే లండన్‌కు సమీపంలోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్ మాన్షన్‌లోనే పింకీ కూడా ఉంటున్నది. మాల్యా దేశం వదిలి వెళ్లిపోయిన సమయంలోనే ఈ పింకీ కూడా వెళ్లినట్లు సమాచారం. మాల్యా తల్లితోనూ ఆమె తరచూ కనిపిస్తూ ఉంటుంది. లండన్ వెస్ట్‌మిన్‌స్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టులో జరుగుతున్న విచారణకు మాల్యాతో కలిసే వస్తుందట. వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ కి పారిపోయిన మాల్యా  2016, మార్చి నుంచి యూకేలోనే ఉంటున్న విషయం తెలిసిందే.