మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం….పదవీ విరమణ వయసు 60 నుంచి 62 కు!

వాస్తవం ప్రతినిధి: మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 60 ఏళ్లుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల‌ రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతున్నట్లు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక ప్రకటన చేశారు. మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనేక అంశాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని ఆయన అన్నారు.  సీఎం అయిన తర్వాత మౌళిక సదుపాయాలపై దృష్టి పెట్టానని, 80 లక్షల హెక్టార్ల భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మార్చాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.