బ్యాంకాక్‌లో ఘోర బస్సు ప్రమాదం..20 మంది సజీవదహనం!

వాస్తవం ప్రతినిధి: థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో శుక్రవారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. థాయ్ సరిహద్దు నుంచి రాజధాని వైపు వస్తున్న బస్సులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగగా, 20 మంది సజీవదహనమయ్యారు. పలువురికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి 1.25 గంటల సమయంలో టాక్ ప్రావిన్స్ సమీపంలో జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు సహాయక సిబ్బంది వెల్లడించారు. డ్రైవర్ మద్యం తాగి బస్సును నడుపుతున్నట్టు గుర్తించామని, అతన్ని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.
థాయ్‌లాండ్‌లో వలస కూలీలకు సరైన జీతాలు ఇవ్వరు. వాహనాల విషయంలో పెద్దగా భద్రతా ప్రమాణాలు పాటించరు. గతేడాది డబ్ల్యూహెచ్‌ఓ(వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌) నిర్వహించిన సర్వేలో థాయ్‌లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 24,000 మంది మృత్యువాతపడ్డారు. గతవారం బ్యాంకాక్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 18 మంది చనిపోయారు.