బాబర్-3 మిసైల్ ని పరీక్షించిన పాక్!

వాస్తవం ప్రతినిధి: పొరుగుదేశం పాకిస్థాన్ బాబర్-3 మిసైల్ ని పరీక్షించినట్లు తెలుస్తుంది. జలాంతర్గామి నుంచి అణ్వాయుధాలు మోసుకెళ్లే ఈ క్షిపణిని పాకిస్థాన్ పరీక్షించినట్లు సమాచారం. దేశీయ టెక్నాలజీతో తయారు చేసిన ఈ బాబర్-3 మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు పాక్ రక్షణ శాఖ ప్రతినిధి జనరల్ అసిఫ్ ఘఫూర్ తెలిపారు. వాస్తవానికి 2010 నుంచి బాబర్ మిస్సైల్ సర్వీసులో ఉన్న సంగతి తెలిసిందే. యుద్ద సమయంలో వినియోగించేందుకు క్రూయిజ్ మిస్సైల్ అయిన బాబర్‌ను పాక్ డెవలప్ చేస్తుంది. సబ్‌మెరైన్ నుంచి ఈ మిస్సైల్ సుమారు500 కేజీల బరువున్న అణ్వాయుధాన్ని మోసుకెళ్లగలిగే కెపాసిటీ ఈ మిసైల్ కి ఉంది. బాబర్ క్రూయిజ్ మిస్సైల్ సుమారు 450 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. పాక్ నౌకాదళం దీన్ని పరీక్షించింది.