పరిటాల కుటుంబంలో పెళ్లి సందడి

వాస్తవం ప్రతినిధి: పరిటాల కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. దివంగత పరిటాల రవి, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత కుమార్తె స్నేహలత వివాహ నిశ్చితార్థం హర్షతో మంత్రి స్వగ్రామమైన అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం వెంకటాపురం గ్రామంలో గురువారం వేడుకగా నిర్వహించారు.
ముందుగా పరిటాల ఘాట్ వద్ద పూలమాలల వేసి ఆయనకు నివాళి అర్పించారు. అనంతరం, వేదమంత్రాల మధ్య స్నేహలత, హర్షలు పూలమాలలు మార్చుకున్నారు.

పరిటాల రవీంద్ర సోదరి వడ్లమూడి శైలజ కుమారుడు హర్ష. మంచి బిజినెస్ మేన్ గా హర్ష గుర్తింపు తెచ్చుకున్నారు. స్నేహలత ఎండీ పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కాల్వ శ్రీనివాసులుతో పాటు పలువురు నేతలు, అధికారులు, టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. వీరి వివాహం మే 6వ తేదీన వెంకటాపురంలో జరగనుంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అప్పుడే ప్రారంభం అయ్యాయి. పరిటాల రవి కోరిక మేరకు వీరి వివాహాన్ని నిర్ణయించినట్టు సమాచారం.