న్యూగినియా లో మరో సారి కంపించిన భూమి

వాస్తవం ప్రతినిధి: పుప్వా న్యూగునియాలో మరోసారి భూమి కంపించినట్లు తెలుస్తుంది. 6.9 తీవ్రతతో ఈ రోజు ఉదయం అక్కడ భూకంపం సంభవించింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు అధికారులు. రాబౌల్‌కు 162 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దాదాపు 35 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ భూకంపం ధాటికి ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ,ఆస్థి నష్టం జరిగింది అన్న దానిపై సమాచారం లేదు.  ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ 7.5 తీవ్రతతో భూకంపం సంభవించడం తో ఎంగ్వా ప్రావిన్సులో సుమారు 100 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.