నీరవ్,చోక్సీ లను వదిలిపెట్టం: నిర్మలా సీతారామన్‌

వాస్తవం ప్రతినిధి: ముంబై లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌ బీ) బ్రాంచ్ లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కుంభకోణం కేసులో నిందితులు అయిన ప్రముఖ వ్యాపారవేత్తలు నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీలు విదేశాలకు పారిపోయారు. ఈ నేపధ్యంలో వారిని ఏమాత్రం వదిలిపెట్టమని, ఎలాగైనా భారత్‌ కు రప్పించి తీరతామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. నీరవ్‌, మెహులు చోక్సీలిద్దరూ ఆర్థిక నేరానికి పాల్పడ్డారని, అవినీతిపరులను వదిలిపెట్టమని నిర్మలా సీతారామన్‌ అన్నారు. అవినీతిరహిత పాలన అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ముందుంటుందని ఆమె స్పష్టం చేశారు.