తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ టీడీపీ : నారా లోకేశ్

వాస్తవం ప్రతినిధి: తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ టీడీపీ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కళా వెంకట్రావు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్ బాబు, టీ టీడీపీ నేతలు ఎల్.రమణ, ఇ.పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబునాయుడు నిర్విరామంగా పనిచేస్తున్నారని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ సంక్షేమం కుంటుపడనీయకుండా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. రాయలసీమ అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని, రాయలసీమకు కియా, అపోలో టైర్స్, హీరో, ఫాక్స్ వాన్ వంటి సంస్థలను తీసుకొచ్చామని, పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని కొనియాడారు.