తీవ్రమైన లాలూ ఆరోగ్య సమస్యలు!

వాస్తవం ప్రతినిధి: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య సమస్యలు తీవ్రమైనట్లు తెలుస్తుంది. దాణా కుంభకోణం కేసులో ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న లాలూ ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి, ఈ నేపధ్యంలో ఈ నెల 17 నుంచి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయనను  మెరుగైన చికిత్స నిమిత్తం గురువారం ఢిల్లీ లోని  ఎయిమ్స్‌కు తరలించినట్లు తెలుస్తుంది. ఇందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కూడా అనుమతించడం తో ఆయనను ఎయిమ్స్ కు తరలించారు. అధిక రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల్లో ఇన్‌ఫెక్షన్‌తో లాలూ బాధపడుతున్నట్లు ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.