కోచ్ పదవికి రాజీనామా చేసిన లీమన్

వాస్తవం ప్రతినిధి: బాల్ టాంపరింగ్ వివాదంలో ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ డారెన్ లీమన్ పాత్ర లేదని క్రికెట్ ఆస్ట్రేలియా క్లీన్‌చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయన తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గురువారం సిడ్నీ చేరుకున్న స్మిత్ మీడియా తో మాట్లడుతూ బోరున విలపించడం తో తన మనసు చలించింది అని, టాంపరింగ్ వివాదంలో ఎలాంటి పాత్ర లేనప్పటికీ నేను ఈ పదవికి అర్హుడను కాను అని భావించి తనపదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దక్షిణాఫ్రికాతో శుక్రవారం ఆరంభమయ్యే చివరిదైన నాలుగో టెస్టు అనంతరం కోచ్ బాధ్యతల నుంచి దిగిపోనున్నట్లు లీమన్ తెలిపారు. వాస్తవానికి 2019 యాషెస్ సిరీస్ వరకు లీమన్ పదవిలో ఉండాల్సి ఉండగా ఈ టాంపరింగ్ కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆసీస్ జట్టుకు మార్గనిర్దేశనం చేసే తదుపరి కోచ్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రయత్నాలు మొదలెట్టింది. కొంతమంది ఆదేశ మాజీ క్రికెటర్లు సైతం ఈ పదవి కోసం ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. వారిలో రికీ పాంటింగ్ పేరు కూడా వినిపిస్తుంది.