“ఎన్టీఆర్ ఎన‌ర్జీ అద్భుతం” : ఆది పినిశెట్టి

వాస్తవం సినిమా: ప్రతి నాయకుడి పాత్రలలో అభిమానులను ఆకట్టుకుంటూ కొత్త పంథాలో దూసుకుపోతున్నారు కథానాయకుడు, పతి నాయకుడు ఆది పినిశెట్టి. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసి వైవిధ్యమైన పాత్రలలో దూసుకుపోతున్నారు. తాజాగా ఆది పినిశెట్టి నటించిన “రంగస్థలం” చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆది అభిమానుల‌తో ఫేస్‌బుక్ ద్వారా ముచ్చటించారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిచ్చారు.

ఇందులో భాగంగా ఓ అభిమాని సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ ల గురించి అడిగిన ప్రశ్నలకు.. “మహేష్ బాబు ఓ అమృత౦. ఇన్ని సంవత్సరాలైనా ఆయన అందం ఇంతైనా తగ్గలేదు. ఆ సీక్రెట్ ఏంటో మహేష్ చెప్పాలి. మేమంతా ఫాలో అవుతాం. ఇంకా మహేష్ నటన గురించి ఏ౦ చెప్పాలి. ఇప్పటి వరకు ప్రభాస్ తో నటించే అవకాశం రాలేదు. ప్రభాస్ నిజమైన బాహుబలి ఒకవేళ వస్తే ఖచ్చితంగా చేస్తా. ఎన్టీఆర్ ఎన‌ర్జీ అద్భుతం” అంటూ సెలవిచ్చాడు.